News February 5, 2025
సఖినేటిపల్లి: సూసైడ్ నోట్ రాసి కుటుంబం అదృశ్యం

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం చెందిన శ్రీనివాస్ (40), భార్య గంగాభవాని (35), కుమార్తె దైవజ్ఞ(6), కుమారుడు మాధవ్ గణేష్(4) మిస్సింగ్ మిస్టరీగా మారింది. స్థానికుల వివరాలు.. ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నాం. చాలా ఏళ్ల నుంచి వడ్డీ కట్టాం. ఇక చెల్లించలేం. అప్పుల బాధ భరించలేకపోతున్నాం. భార్య పిల్లలతో చచ్చిపోతామంటూ సూసైడ్ నోటు రాసి కుటుంబం అదృశ్యమైంది. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 8, 2025
గూడూరు: ఒక్కడే కొడుకు.. పుత్ర శోకం మిగిల్చాడు!

గూడూరు మండల కేంద్రానికి చెందిన <<18232373>>షేక్ సోహెల్<<>> శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలంలో పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న యాకూబ్‌కు ఒక్కగానొక్క తనయుడు సోహెల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన తనయుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే తమ మొబైల్ షాప్‌లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొడుకు ఇక రాడని తండ్రి కన్నీటి పర్యంతమైన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.
News November 8, 2025
HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

డంపింగ్ యార్డ్ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.
News November 8, 2025
బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోండి!

రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్‌లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ & పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించొచ్చు.


