News September 9, 2024

సగం జీతం సాయం చేసిన తిరుపతి కలెక్టర్

image

విజయవాడ వరద బాధితులకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఈ మేరకు తన సగం జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే డీఆర్వో రూ.25 వేలు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జిల్లాలోని పలువురు అధికారులు విరాళాన్ని ప్రకటించారు.

Similar News

News February 26, 2026

‘సంజీవని’ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

image

సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు. ఈ సేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకునేలా చూడాలని సూచించారు.

News February 26, 2026

పనులు పరిశీలించిన చిత్తూరు కలెక్టర్

image

త్వరలో చిత్తూరులో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

News February 26, 2026

చిత్తూరులో ఆ అధికారులంతా ట్రాన్స్‌ఫర్

image

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు