News January 18, 2026
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

అత్యధిక వేదికల్లో సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 35 వేదికల్లో శతకాలు నమోదు చేసి సచిన్(34) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(26), పాంటింగ్(21) ఉన్నారు. మరోవైపు NZపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ రికార్డులకెక్కారు. కోహ్లీ(10) తర్వాతి స్థానాల్లో కలిస్(9), రూట్(9), సచిన్(9), పాంటింగ్(8), సెహ్వాగ్(8) ఉన్నారు.
Similar News
News February 19, 2026
రైతులను పెళ్లాడే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి.. MLA అభ్యర్థన

కర్ణాటకలో INC MLA రంగనాథ్ ఓ వినూత్న ప్రతిపాదనతో CM సిద్దరామయ్యకు లేఖ రాశారు. రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ‘నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న కునిగల్ సెగ్మెంట్‌లో మెజార్టీ ఫ్యామిలీలకు అగ్రికల్చరే జీవనోపాధి. అక్కడ వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావట్లేదు. దీంతో చాలామంది 30ఏళ్లు దాటినా ఒంటరిగానే మిగిలిపోతున్నారు’ అని పేర్కొన్నారు.
News February 19, 2026
యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్!

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్ చేస్తే జీరోగా కనిపిస్తోంది. ఫీడ్ కూడా మాయం అయింది. కాగా హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైంది. అన్వేష్ ఇన్‌స్టాను బ్లాక్ చేయాలని హైదరాబాద్ CCS పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
News February 19, 2026
పాక్‌లో పేలుడు.. 16 మంది మృతి

పాకిస్థాన్ కరాచీలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పటివరకు 16 మంది మరణించారని, మరో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా కరాచీలో గతేడాది కూడా ఐదంతస్తుల భవనం కూలడంతో 27 మంది మరణించారు.


