News August 8, 2025
సచివాలయ ఉద్యోగిపై చీటింగ్ కేసు నమోదు

సచివాలయ ఉద్యోగి సంజీవ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పుంగనూరు SI వెంకటరమణ తెలిపారు. కొండందొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతుకు రామకుప్పం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంజీవ్ ట్రాక్టర్ ఇప్పిస్తానంటూ రూ.4.60 లక్షలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ ఇప్పించమని అడగగా ఆయన ముఖం చాటేయడంతో మోసిపోయానని గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
Similar News
News August 9, 2025
కార్వేటి నగరంలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం

కార్వేటి నగరంలో వేణుగోపాలస్వామి వారి తెప్పోత్సవం మూడవ రోజు టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై కొలువు దీర్చి పురవీధుల్లో భక్తులకు దర్శనం కల్పించారు. చివరి రోజు వేణుగోపాలస్వామి తెప్పోత్సవం వీక్షించడానికి కోనేరు వద్దకు భక్తులు భారీ ఎత్తున విచ్చేశారు.
News August 8, 2025
చౌడేపల్లి: ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్

చౌడేపల్లి మండలంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తలి మండలి నియామకానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 27 లోపు దేవస్థాన కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 7న నోటిఫికేషన్ జారీ చేశారని దరఖాస్తుకు 20 రోజుల గడువు విధించారని ఆయన చెప్పారు.
News August 8, 2025
చిత్తూరు: నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

వెదురుకుప్పానికి చెందిన లోకేశ్‌కు పోక్సో కోర్ట్ 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.9,500 జరిమానా విధించింది. నిందితుడు 2022లో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2022 ఫిబ్రవరి 4న తిరుపతి DSP మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిత్తూరు పోక్సో కోర్టులో గురువారం వాదనల అనంతరం జడ్జ్ నిందితుడికి శిక్ష విధించారు.