News March 13, 2025
సత్తమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తల్లి సత్తమ్మ(87) గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పూర్వం చేర్యాల నియోజకవర్గం సీపీఐ నాయకులు మద్దూరు మండలం నర్సాయపల్లిలో స్వగృహంలో సత్తమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 17, 2026
MHBD: ‘టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి’

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశిరాం అన్నారు. MHBD పట్టణంలోని నాయకుల ఆశ్రయం పాఠశాలలో నిర్వహించిన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్, వెల్ఫేర్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ATDO భాస్కర్, ఉపేందర్ తదితరులున్నారు.
News February 17, 2026
ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారిగా కృష్ణప్రసాద్

ఖమ్మం అటవీశాఖ డివిజన్ అధికారిగా సిహెచ్ కృష్ణప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణకు ప్రాధాన్యతనిస్తామని, హరితహారం, సామాజిక అటవీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎఫ్‌ఓకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
News February 17, 2026
చిత్తూరు: అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకతవకలు.?

జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం(M)లో ఇంటర్వ్యూలకు కొందరు కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరయ్యారు. వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు. కొంతమంది National institute of Open Schoolలో 10th చదివినట్లు సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సర్టిఫికెట్లతో మరెంత మంది ఉద్యోగాల్లో చేరారన్నది చర్చనీయాంశంగా మారింది.


