News March 2, 2025

సత్తుపల్లిలో గురు శిష్యుల కలయిక… ఎవరెవరో తెలుసా..?

image

వారిద్దరు గురు శిష్యులు. మళ్లీ ఇద్దరి పేరూ‌ ఒక్కటే. ఒకరినొకరు ఏడాదిగా కలుసుకున్నది లేదు. కానీ వాళ్లు పలకరించుకునేందుకు సందర్భంగా మారిన ఘటన‌ శనివారం సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. అయితే వారిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే.. మరొకరు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. సీనియర్ నేత గాదె సత్యనారాయణ అంత్యక్రియలకు హాజరైన సందర్భంలో చిత్రమిది.

Similar News

News March 1, 2026

షేర్ మార్కెట్ పేరుతో నిలువు దోపిడీ.. కేటుగాడికి రిమాండ్

image

ఖమ్మం: ఆన్‌లైన్ ఉద్యోగాలు, షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో అధిక లాభాల ఆశచూపి రూ.47 లక్షలు వసూలు చేసిన కేటుగాడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి రిమాండ్ విధించి జైలుకు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

News March 1, 2026

ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

image

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News March 1, 2026

ఖమ్మం: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు..

image

ఖమ్మం జిల్లాలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నా, ఆచరణలో మాత్రం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్తకార్డులతో పాటు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుల కోసం నెలల తరబడి వేచి చూస్తున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరుతున్నారు.