News October 19, 2025

సత్తుపల్లిలో 3,000 ఉద్యోగాలకు మెగా జాబ్ మేళా

image

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో TASKసహకారంతో ఈ నెల 26న సత్తుపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఓసీ పీఓలు ప్రహ్లాద్, ఎంవీ. నరసింహారావులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన 50 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. ఇంటర్వ్యూలను 23, 24, 25 తేదీలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేపట్టనున్నారు. నిరుద్యోగులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 21, 2025

కొయ్యలగూడెం అమ్మాయికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌

image

“ముదితల్ నేర్వగరాని రాని విద్య కలదే ముద్దారగ నేర్పింపగన్” అన్న ఆర్యోక్తి దాసరోజు అలేఖ్యకి వర్తిస్తుంది. కోచ్, తండ్రి శ్రీధర్ పర్యవేక్షణలో తొమ్మిదవ తరగతి విద్యనభ్యసించే కొయ్యలగూడెం విద్యార్థి అలేఖ్య కరాటే విభాగంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పలు పతకాలు సొంతం చేసుకుంది. చెన్నైలో గత నెల 18న నిర్వహించిన సెలక్షన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.

News October 21, 2025

మిమ్మల్ని చిత్తూరు ప్రజలు మరవలేరు..!

image

2020 నవంబర్ 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఐరాల(M) రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. 2007లో చిత్తూరులో CKబాబుపై జరిగిన హత్యాయత్నంలో గన్‌మెన్స్ హుస్సేన్ బాషా, సురేంద్ర అమరులయ్యారు. 2017లో పలమనేరు అడవుల్లో మహిళను అత్యాచారం చేయబోయారు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డు దేవంద్ర చనిపోయారు.
#నేడు అమరవీరుల దినోత్సవం

News October 21, 2025

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అటు నిన్న 72,026 మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 23,304 మంది తలనీలాలు సమర్పించారన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.