News February 2, 2026

సత్తుపల్లి ఆలయంలో చిల్లర వదిలెళ్లారు

image

సత్తుపల్లి జవహర్ నగర్‌లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి గడ్డపలుగుతో హుండీని పగులగొట్టిన దొంగలు, అందులోని సుమారు రూ.20 వేల నోట్లను ఎత్తుకెళ్లారు. అయితే, బరువుగా ఉన్నాయనో ఏమో కానీ సుమారు రూ.5 వేల విలువైన నాణేలను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 2, 2026

BREAKING.. ఏసీబీకి చిక్కిన ఖమ్మం తూనికల శాఖాధికారి

image

తూనికలు, కొలతల శాఖ ఖమ్మం జిల్లా అధికారి ప్రవీణ్‌కుమార్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వేబ్రిడ్జి ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు ఓ ఏజెంట్‌ను రూ.10 వేలు డిమాండ్‌ చేయగా, రూ.5వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ బృందం కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ప్రవీణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News February 2, 2026

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌ అనుదీప్‌

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి తక్షణమే శిక్షణ పూర్తి చేయాలని, కౌంటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో దుకాణాలు కోల్పోయిన వారి కోసం స్ట్రీట్ వెండర్ జోన్‌ ఏర్పాటుకు తగిన తీసుకోవాలని సూచించారు.

News February 2, 2026

ఖమ్మం: మిరప తోటలో ప్రేమ.. కూలీలకు పెళ్లి చేసిన రైతు!

image

నేలకొండపల్లి(M) ముటాపురం బిల్యాతండాలో ఒక రైతు తన ఉదారతతో మానవత్వాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి మిరప కోతకు వచ్చిన కూలీలు పూల్‌సింగ్‌, ఆశాలు ప్రేమలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న రైతు భూక్యా మోహన్‌రావు.. వారిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో వీరన్న స్వామి సన్నిధిలో వివాహం జరిపించి, ఆశీర్వదించారు. కూలీల పట్ల రైతు చూపిన ప్రేమను స్థానికులు అభినందించారు.