News January 14, 2026

సత్తుపల్లి ‘జిల్లా’.. అభివృద్ధి మంత్రమా? ఎన్నికల తంత్రామా?

image

దశాబ్దాల కాలంగా నానుతున్న ‘సత్తుపల్లి జిల్లా’ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఖమ్మం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి పరిపాలన వికేంద్రీకరణ అవసరమన్నది ప్రజల ఆకాంక్ష. అయితే, మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నినాదం వెనుక రాజకీయ వ్యూహముందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఓట్ల కోసమే వేసిన ఎత్తుగడనా లేక నిజమైన అభివృద్ధి ప్రణాళికా? అన్నది ప్రభుత్వం ఇచ్చే స్పష్టతపైనే ఆధారపడి ఉంది.

Similar News

News January 23, 2026

తిరుపతి: SC, STలకు గమనిక

image

SC, ST సమస్యలపై తిరుపతి కలెక్టేరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. పోలీస్, అటవీ శాఖతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. అర్జీలను డైరెక్ట్‌గా కలెక్టర్‌కు సమర్పించవచ్చు.

News January 23, 2026

MBNR: సంక్రాంతి వేళ ఆర్టీసీకి భారీ ఆదాయం.!

image

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈనెల 9 నుంచి 20 వరకు 794 ప్రత్యేక బస్సులను నడపగా, సంస్థకు ₹22.70 కోట్ల ఆదాయం సమకూరినట్లు రీజనల్ కో-ఆర్డినేటర్ సంతోష్ కుమార్ తెలిపారు. సుమారు 39.20 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయం రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

News January 23, 2026

కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

image

పాకిస్థాన్‌ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్‌లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.