News January 5, 2026
సత్తుపల్లి: నీటి సంపులో పడి వ్యక్తి మృతి

సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి ఓలేటి వెంకటరమణ (50) అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. సంపులో పడిన వెంకటరమణను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News February 13, 2026
పరకాలలో బీఆర్ఎస్‌దే ఫస్ట్ వార్డ్

పరకాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణి కొట్టింది. నువ్వానేనా అంటూ సాగిన ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి గెలుపొందారు. తొలి రౌండ్‌లోనే.. తొలి ఫలితం బీఆర్ఎస్ వైపు రావడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
News February 13, 2026
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ

TG: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 11 చోట్ల గెలిచారు. BRS ఒక స్థానంలో విజయం సాధించింది. ఇదే జిల్లాలోని హాలియాలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ పదింట్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. BRS రెండు వార్డుల్లో విజయం సాధించింది. చండూరు, చిట్యాల మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
News February 13, 2026
అశ్వారావుపేట ఏడో వార్డులో రవికిరణ్ ఘన విజయం

నూతనంగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొల్లి రవికిరణ్ విజయకేతనం ఎగురవేశారు. ఏడో వార్డు నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం, జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై ఆయనకున్న అవగాహన ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంపై పట్టణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


