News June 4, 2024
సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ విక్టరీ

సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News February 7, 2026
గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.
News February 6, 2026
PHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు.
రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News February 6, 2026
ఉద్దండరాయునిపాలెం: రేపు క్వాంటం వ్యాలీకి సీఎం భూమిపూజ

రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో శనివారం క్వాంటం వ్యాలీ నిర్మాణానికి CM చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు కార్యక్రమ ప్రదేశాన్ని పర్యవేక్షించి, బందోబస్తుపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు స్వయంగా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


