News April 8, 2025

సత్తెనపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య

image

బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ సురేశ్ కుమార్ కుమార్తె సాహితీ సంధ్య (18) శ్రీకాకుళం జిల్లాలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది. సెలవులకి ఇంటికి వచ్చింది. కళాశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో సంధ్య చిన్నమ్మ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 17, 2025

ఎంజీఎంలో దొంగలు ఉన్నారు.. జాగ్రత్త! 

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఆవరణలో మట్టెవాడ పోలీసులు బుధవారం బ్యానర్ కట్టారు.  ఈ మేరకు ఆసుపత్రికి వచ్చే వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆసుపత్రిలో గుర్తు తెలియని దొంగలు తిరుగుతున్నారని, వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

News April 17, 2025

KNR: ఊరు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

వేసవి సెలవుల దృష్ట్యా ఇంటికి తాళం వేసి వెళ్లేవారు, అలాగే బస్సుల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు. ఊరెళ్లేవారు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా తమ వెంట దాచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లే ముందు చుట్టుపక్కల నమ్మకస్తులకు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.

News April 17, 2025

మంచిర్యాల: ఒకరి అరెస్ట్.. ఇద్దరు పరార్

image

మంచిర్యాల జిల్లాకేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ ఏరియాలో గంజాయి కలిగి ఉన్న ముగ్గురిలో ఒకరిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లగా ఇద్దరు పారిపోయారు. మాడవి జీవన్ జాషువాను పట్టుకున్నారు. అతడి నుంచి 1.080కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు పంపించారు.

error: Content is protected !!