News July 8, 2025

సత్తెనపల్లి: ఫారెక్స్ మోసం, వరకట్న వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు

image

సత్తెనపల్లిలో రెండు వేర్వేరు ఫిర్యాదులు ఎస్పీకి చేరాయి. ఫారెక్స్ వ్యాపారంలో 10% లాభం ఆశచూపి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్, మధుసూదన్ రెడ్డిలు తనను రూ.45.67 లక్షలు మోసం చేశారని భీమవరం వాసి బలుసుపాటి కోటయ్య ఫిర్యాదు చేశారు. మరోవైపు సంతానం లేదని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని నాగన్నకుంటకు చెందిన షేక్. తాహిరా న్యాయం చేయాలని కోరారు.

Similar News

News July 8, 2025

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన అచ్చెన్నాయుడు

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఆయన కార్యాలయానికి వెళ్లి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయనను అచ్చెన్న కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

News July 8, 2025

కారంచేడులో పంచాయతీ పురోగతి సూచిక 2.0 శిక్షణ కార్యక్రమం

image

కారంచేడు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ పురోగతి సూచిక 2.0 ఎఫ్ వై శిక్షణా కార్యక్రమం డీఎల్‌డీ‌ఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి పంచాయతీల్లో అభివృద్ధి, పారిశుద్ధ్యం తాగునీరు తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో నేతాజీ, డిప్యూటీ ఎంపీడీవో కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

News July 8, 2025

సర్వే ప్రక్రియ రెవెన్యూ వ్యవస్థకు వెన్నుముక: కలెక్టర్ రాహుల్ శర్మ

image

సర్వే ప్రక్రియ రెవెన్యూ వ్యవస్థకు వెన్నుముకని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం గనుల వృత్తి శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు శిక్షణను ఆయన పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడి, శిక్షణా కార్యక్రమం తీరును అడిగి తెలుసుకున్నారు. సర్వే విషయంలో సంపూర్ణ అవగాహన అవసరమని, భూ సమస్యల పరిష్కారానికి సర్వే చాలా కీలకమని కలెక్టర్ వివరించారు.