News May 26, 2024

సత్తెనపల్లి మీదుగా వెళ్లే రైళ్లు దారి మళ్లింపు

image

పల్నాడు జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో సత్తెనపల్లి మీదగా వెళ్లే ఫలక్నామా ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్‌లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు కాజీపేట, విజయవాడ మీదుగా గమ్య స్థలానికి వెళ్తాయన్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరమ్మతు పనులు వేగవంతం చేశామని చెప్పారు.

Similar News

News February 20, 2026

అమరావతికి సిద్ధం కానున్న అసలైన మణిహారం

image

అమరావతికి అసలైన మణిహారం సిద్ధమవుతోంది. రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. మొత్తం 96.2 కిలోమీటర్ల పొడవుతో, 75 మీటర్ల భారీ వెడల్పుతో ఈ రహదారిని డిజైన్ చేశారు. ఇది 8+4 వరుసల (Lanes) కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. అంటే ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉంటే, స్థానిక రవాణా కోసం అధనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లు ఉంటాయి.

News February 20, 2026

తెనాలిలో పర్యటించిన YS షర్మిల

image

PCC అధ్యక్షురాలు YS షర్మిల శుక్రవారం తెనాలిలో పర్యటించారు. ఆమె పాదయాత్రలో భాగంగా ఉదయం తెనాలి చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా BJP ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

News February 20, 2026

గుంటూరు: ‘స్త్రీ శక్తి’తో 1.70 లక్షల టికెట్లు

image

మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా భక్తుల ప్రయాణం భారీగా పెరిగింది. స్త్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం ద్వారా
మహిళలు శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, గోవాడ వంటి శైవక్షేత్రాలకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని 5 డిపోల నుంచి అదనపు సర్వీసులు నడిపించారు. 2 రోజుల్లో 1.70 లక్షల మందికి పైగా మహిళలకు జీరో టిక్కెట్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగిందన్నారు.