News October 15, 2025
సత్తెనపల్లి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్

సత్తెనపల్లి మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, మహిళలు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని చితకబాదగా, గ్రామ పెద్దలు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగరాదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
Similar News
News October 15, 2025
గూగుల్ రాక.. CBN అదిరిపోయే ట్వీట్

AP: వైజాగ్‌లో <<18002028>>గూగుల్<<>> AI హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. VIZA‘G’లో ఉండే G అంటే ఇప్పుడు గూగుల్ అని పేర్కొన్నారు. ‘యంగెస్ట్ స్టేట్ హై ఇన్వెస్ట్‌మెంట్’ అంటూ హాష్ ట్యాగ్ ఇచ్చారు. గూగుల్ రాకపై ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News October 15, 2025
అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం వంటి ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్న వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.
News October 15, 2025
సంక్రాంతికి కోనసీమ బీచ్ ఫెస్టివల్: కలెక్టర్

అక్టోబరు 15 కోనసీమ బీచ్ ఫెస్టివల్‌ను సంక్రాంతికి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలు, హోం స్టే విధానాల ప్రదర్శన ప్రధానంగా ఉంటుందని తెలిపారు. బుధవారం ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం నందు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఫెస్టివల్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఫెస్టివల్ నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.