News October 5, 2025

సత్యదేవుని ఆలయంలో రథోత్సవం

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం నిర్వహించే రథోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వయంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వైభవంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు.

Similar News

News October 5, 2025

మెదక్: మద్యం దుకాణాలకు 6 దరఖాస్తులు

image

జిల్లాలో మద్యం దుకాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మెదక్ పరిధి పోతంశెట్టిపల్లి (15వ దుకాణం) 3 దరఖాస్తులు, పాపన్నపేట (10) ఒక దరఖాస్తు, రామాయంపేట పరిధి మాసాయిపేట (42) ఒకటి, నార్సింగి (43) ఒక దరఖాస్తురాగా మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈనెల 18 వరకు పని దినాలలో ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

News October 5, 2025

కలెక్షన్లలో పవన్ కళ్యాణ్ ‘OG’ సెన్సేషన్

image

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘OG’ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచిందని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’(రూ.300+ కోట్లు) రికార్డును బ్రేక్ చేసినట్లు అయింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.

News October 5, 2025

కాకినాడ: ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్ష

image

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టుల నియామకానికి సంబంధించిన రాత పరీక్షలు ఆదివారం జేఎన్టీయూ కళాశాల కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. పరీక్షకు మొత్తం 272 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 212 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.