News March 2, 2025

సత్యవేడులో కేజీ చికెన్ ధర రూ.90

image

సత్యవేడు పట్టణంలో కేజీ చికెన్ 90 రూపాయలకు అమ్ముతున్నారు. లైవ్ చికెన్ 70 రూపాయలకే ఇస్తామని నిర్వాహకులు కోళ్ల చిన్న తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చికెన్ కొనడానికి ఎగబడుతున్నారు. బుధవారం కేజీ చికెన్ ధరను 120-100 రూపాయలకు అమ్మారు. వరదయ్యపాలెం మండలంలో కేజీ చికెన్‌ ధర రూ.180 పలుకుతుంది.

Similar News

News December 31, 2025

డాంగ్ టావో కోడి.. కేజీ మాంసం రూ.1.50 లక్షలు

image

‘డాంగ్ టావో’ వియత్నాంకు చెందిన కోడి. దీని ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ కోడి పాదాలు కాస్త లావుగా ఉంటాయి. వియత్నాం రెస్టారెంట్లలో ఈ కోడి మాంసం చాలా స్పెషల్. ఇక్కడి ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోడి మాంసాన్ని తినకపోతే తప్పుగా భావిస్తారు. అందుకే ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఈ కోడి మాంసాన్ని తింటారు. ఇంత డిమాండ్ వల్లే ఈ మాంసం కిలో దాదాపుగా రూ.1.50 లక్షలుగా ఉంటుంది. సీజన్ బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.

News December 31, 2025

నిమ్మకాయ దీపం వెలిగిస్తూ చదవాల్సిన మంత్రాలు..

image

‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే’ శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి. ఇవి మనసులో సాత్విక భావనను పెంచి, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి శాంతిని చేకూరుస్తాయి. దీపారాధన చేసే సమయంలో ఏకాగ్రతతో అమ్మవారిని స్మరించడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.

News December 31, 2025

సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్‌ఫుల్!

image

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్‌ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్‌ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్‌ రూమ్‌లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.