News January 25, 2025

సత్యసాయి: ‘ఆడబిడ్డలు పుట్టింటికి ప్రాణం.. మెట్టింటికి జీవం’

image

‘ఆడబిడ్డలు పుట్టింటికి ప్రాణం.. మెట్టింటికి జీవనం’ అని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజ్ బేగం అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ పరిధిలో సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు గౌరవప్రదమైన జీవితం, విద్య, ఉద్యోగ అవకాశాలు పొందడం వారి హక్కు అని తెలిపారు.

Similar News

News November 11, 2025

ములుగు: పథకం ప్రకారమే లొంగిపోయారు: ‘మావో’ లేఖ

image

ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు సోను, సతీశ్‌లకు మావోయిస్టు పార్టీ పంథాను తప్పుపట్టే హక్కు లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సోను, సతీశ్‌లు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని పథకం ప్రకారం లొంగిపోయారన్నారు. అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అడవుల్లో మోహరించాయన్నారు.

News November 11, 2025

బాలికల గురుకుల పాఠశాల ఘటనలో నిందితుడు అరెస్ట్

image

కదిరిలో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమంగా ప్రవేశించి బాలికలను భయాందోళనకు గురి చేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈనెల 4న రాత్రి సమయంలో కుమ్మరోళ్లపల్లి గ్రామానికి చెందిన మహేష్(20) హాస్టల్ గోడదూకి
గురుకులంలోకి ప్రవేశించాడు. అడ్డుకునేందుకు యత్నించిన సెక్యూరిటీ గార్డు ఉమాదేవి, బాలికలను కర్రతో బెదిరించి పారిపోయాడు. ఈ ఘటనపై కదిరి టౌన్ PSలో కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.

News November 11, 2025

కామారెడ్డి: ఆరుగురికి జైలు.. 50 మందికి జరిమానా

image

మద్యం తాగి వాహనం నడిపితే, శిక్ష తప్పదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. కామారెడ్డి, దేవునిపల్లి, తాడ్వాయి PS పరిధిలోని ఆరుగురు (ప్రతి స్టేషన్‌కు ఇద్దరు) నిందితులకు కోర్టు ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. అదేవిధంగా మాచారెడ్డి, సదాశివనగర్, బిక్కనూర్ PS పరిధిలోని కేసులతో కలిపి మొత్తం 50 మంది డ్రైవర్లకు న్యాయస్థానం రూ.50 వేల జరిమానా విధించినట్లు SP వివరించారు.