News March 18, 2025
సత్యసాయి: ‘ఆధార్ నమోదులో తప్పులు దొర్లరాదు’

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News December 28, 2025
NTR: చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

చపాతీ ముక్క ప్రాణం తీసిన ఘటన విజయవాడలోని చిట్టినగర్‌లో విషాదం నింపింది. తోట ప్రసాద్ అనే వ్యక్తి శనివారం చపాతీ తింటుండగా ఒక్కసారిగా చపాతి ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 సిబ్బంది వచ్చేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
News December 28, 2025
జిల్లా అధ్యక్షుడి తీరుపై అధిష్ఠానం సీరియస్..!

నల్డొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. వర్షిత్‌రెడ్డిని పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
News December 28, 2025
భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం: ములుగు ఎస్పీ

మేడారం వన దేవతల దర్శనానికి ముందస్తు మొక్కుల చెల్లింపు కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎస్పీ రామనాథన్ కేకన్ తెలిపారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో మేడారం రానున్న నేపథ్యంలో గద్దెల వద్ద ఏర్పాటులను ఎస్పీ పరిశీలించారు. పునర్నిర్మాణ పనుల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.


