News March 18, 2025
సత్యసాయి: ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు దొర్లరాదు

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News February 15, 2026
తారిఖ్ ప్రమాణ స్వీకారానికి ఓంబిర్లా!

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ సైతం హాజరుకానున్నట్లు చెప్పాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలిచిన తారిఖ్ ఢాకాలో FEB 17న ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు రావాలని PM మోదీకి ఆహ్వానం అందగా ఆయన స్థానంలో ఓంబిర్లా హాజరవుతున్నారు.
News February 15, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. Meekosam.ap.gov.inలోనూ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 1100 కాల్ చేసి చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News February 15, 2026
బ్లాక్ సర్కిల్స్‌కి ఇంటి చిట్కాలు

కంప్యూటర్లపై ఎక్కువ పనిచేయడం, వేళకు నిద్రలేకపోవడం, ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కొందరికి కళ్ల కింద నల్లటి చారలు వచ్చేస్తాయి. వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. * బంగాళదుంపరసం తీసుకుని కళ్ల అడుగున రాసి 15ని తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. * బాదంనూనెలో ఉండే విటమిన్ K నల్లటి వలయాలను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్ల చుట్టూ రాసుకుని మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.


