News July 30, 2024
సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 1న మడకశిర మండలం గుండుమల గ్రామానికి రానున్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంట నుంచి హెలికాప్టర్‌లో మ.12.20 గంటలకు పయనమై మ.1.45 గంటలకు గుండుమలకు చేరుకుంటారు. మ.2.20 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం కావేరమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. సా.4.55 గంటలకు పుట్టపర్తికి చేరుకుని ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్తారు.
Similar News
News November 11, 2025
వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2025
కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.
News November 10, 2025
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.


