News April 13, 2025

సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

image

పరిగి మండలం ధనాపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. రొద్దం మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన వారు ఆటోలో హిందూపురం కోటిపి చౌడమ్మ దేవస్థానానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 23, 2025

కూలీ కుమారుడికి 593 మార్కులు

image

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

News April 23, 2025

10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

image

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్‌తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.

News April 23, 2025

10th Results: 23వ స్థానంలో అనంతపురం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 30,700 మంది పరీక్ష రాయగా 21,510 మంది పాసయ్యారు. 15,733 మంది బాలురులో 10,315 మంది, 14,967 మంది బాలికలు పరీక్ష రాయగా 11,195 మంది పాసయ్యారు. 70.07 పాస్ పర్సంటైల్‌తో అనంతపురం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!