News December 22, 2025

సత్యసాయి జిల్లాలో దారుణం.. గర్భిణిపై దాడి

image

తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. టపాసులు పేల్చవద్దని కోరిన గర్భిణి సంధ్యారాణిపై వైసీపీ కార్యకర్త అజయ్ దాడి చేశాడు. ఆమెను కాలుతో తన్నడంతో అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News December 22, 2025

పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు: జూపల్లి

image

TG: పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని <<18633566>>KCR<<>>ను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ‘BRS పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వారి హయాంలో ప్రధాన కాలువలు పూర్తి చేయలేదు. పాలమూరు-RRని తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన KCR ఇప్పుడేమో సాగునీటి ప్రాజెక్టు అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.40-50 వేల కోట్లు కావాలి’ అని చెప్పారు.

News December 22, 2025

అమలాపురం: PGRSకు 250 అర్జీలు

image

అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన PGRSకు 250 అర్జీలు అందాయని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, వసతుల కల్పన వంటి అంశాలపై ప్రజలు వినతులు అందజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News December 22, 2025

బీజేపీతోనే సుపరిపాలన సాధ్యం: MP పురందీశ్వరి

image

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని MP పురందీశ్వరి అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా సోమవారం రాజమండ్రిలోని తన కార్యాలయం వద్ద ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా సుపరిపాలన అందుతోందని పేర్కొన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.