News March 19, 2026
సత్యసాయి జిల్లాలో పత్తి లారీ బోల్తా

తనకల్లు (మ) మండ్లిపల్లి సమీపంలో NH-47 జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ పత్తి లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరి కాలు తెగిపోగా, మరొకరి చేతికి దెబ్బ తగిలింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 13, 2026
విజయశాంతిరెడ్డి ఆత్మహత్య.. భర్త సంచలన ఆరోపణలు

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రెండు నెలల కిందట పిల్లలతో కలిసి <<19059157>>ఆత్మహత్య<<>> చేసుకున్న విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య కుటుంబీకుల వేధింపుల వల్లే వారు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. ‘నా అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి నమ్మించి మోసం చేశారు. విజయ చనిపోయిన నాటి నుంచి ఆస్తుల కోసం నన్ను వేధించారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలి’ అని పోలీసులను కోరారు.
News April 13, 2026
‘B.Ed’ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్!

AP: స్టడీ లీవ్ పేరిట ప్రైవేటు కాలేజీల్లో B.Ed, B.P.Ed చదువుతున్న టీచర్ల గురించి ఆరా తీసిన ఉన్నత విద్యామండలి విస్తుపోయే విషయాలు గుర్తించింది. వీరు క్లాసులకు హాజరు కాకుండా హాజరును మేనేజ్ చేసుకుంటున్నారు. ఇతర విద్యార్థులూ ఇలానే ఉన్నట్లు, ఏటా ఇదే తంతు నడుస్తున్నట్లు గమనించింది. ప్రమాణాలు దెబ్బతింటుండడంతో ఇకపై ఈ కాలేజీల్లో విద్యార్థులకు 2పూటలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్సును అమలుచేయాలని నిర్ణయించింది.
News April 13, 2026
ములుగు: మురుగునీరే విద్యార్థులకు తాగునీరు!

ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో తాగునీటికి గుత్తికోయలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని జంపన్నవాగు నుంచి తెచ్చుకున్న చెలిమనీటితో దాహార్తి తీర్చుకుంటున్నారు. కాగా, ఆ నీరు కలుషితంతో రోగాల బారిన పడుతున్నామన్నారు. అక్కడే ఉన్న ఓ పాఠశాలలో సైతం విద్యార్థులు తాగే నీటిని చూస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే 36 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో మురికి నీరే తాగుతుండడం Way2Newsకి చిక్కింది.


