News April 19, 2024
సత్యసాయి జిల్లాలో 16 మంది నామినేషన్ల దాఖలు
శ్రీ సత్య సాయి జిల్లాలోని రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల నుంచి 16మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నుంచి ముగ్గురు, మడకశిర నుంచి ఒకరు, హిందూపురం నుంచి ఇద్దరు, పెనుకొండ నుంచి ఇద్దరు, పుట్టపర్తి నుంచి నలుగురు, ధర్మవరం నుంచి ఒకరు, కదిరి నుంచి ముగ్గురు నామినేషన్లు వేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News January 26, 2025
మాడుగుల నాగఫణి శర్మకు ‘పద్మశ్రీ’ అవార్డు.. బయోడేటా ఇదే..!
అనంతపురం(D) పుట్లూరు(M) కడవకల్లుకు చెందిన మాడుగుల నాగఫణిశర్మ ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. నాగభూషణశర్మ, సుశీలమ్మకు 1959లో జన్మించారు. పదో తరగతి పుట్లూరులో చదివి, సాహిత్య శిరోమణి పట్టా కోసం తిరుపతి వెళ్లారు. ఆంధ్ర, మైసూర్, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో చదివారు. 1985-90లో కడపలో సంస్కృత ఉపన్యాసకుడిగా చేశారు. 1990-92 మధ్యకాలంలో టీటీడీ ధర్మప్రచార పరిషత్తు అడిషనల్ కార్యదర్శిగా పనిచేశారు.
News January 26, 2025
రిపబ్లిక్ వేడుకలకు అనంతపురం జిల్లా సర్వం సిద్ధం
జనవరి 26న పురస్కరించుకొని రిపబ్లిక్ వేడుకలకు అనంతపురం జిల్లా సర్వం సిద్ధమైంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని జాతీయ పతాకం లోని కాషాయపు రంగు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన విద్యుత్ దీపాలను అలంకరించారు. విద్యుత్ దీపాలు సుందరంగా అలంకరించడంతో కలెక్టర్ కార్యాలయం ఆకట్టుకుంటోంది. రేపు ఉదయం జాతీయ జెండా త్రివర్ణ పతాకాలు ఎగరనున్నాయి.
News January 25, 2025
అనంతపురం జిల్లా వాసికి ‘పద్మశ్రీ’
కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా ఏపీ నుంచి ఐదుగురికి వరించాయి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన మాడగుల నాగఫణిశర్మ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆర్ట్ విభాగంలో నాగఫణిశర్మకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.