News April 22, 2024
సత్యసాయి జిల్లాలో 2012మంది వాలంటీర్ల రాజీనామా

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లాలో 2012 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. జిల్లాలో మొత్తం 9187మంది వాలంటీర్లు ఉండగా ఇప్పటివరకు 2012 మంది రాజీనామా చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వారిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 69మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో మెుత్తం 2072 మంది అయ్యారు.
Similar News
News April 21, 2025
ఉమ్మడి అనంత జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి అనంత జిల్లాలో డీఎస్సీ ద్వారా 807 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-314 ➤ BC-A:60 ➤ BC-B:75
➤ BC-C:9 ➤ BC-D:60 ➤ BC-E:29
➤ SC- గ్రేడ్1:20 ➤ SC-గ్రేడ్2:52
➤ SC-గ్రేడ్3:66 ➤ ST:49 ➤ EWS:73
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం<<16156843>> ఇక్కడ క్లిక్<<>> చేయండి.
News April 21, 2025
ATP: పోస్టులు 807.. పోటీ వేలల్లో..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఎస్సీ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాకు 807 పోస్టులు మంజూరు కాగా టీచర్ ఉద్యోగాలకు సుమారు 40వేల మంది పోటీ పడనున్నట్లు సమాచారం. 202 ఎస్జీటీ పోస్టులకూ 24 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశముంది. దీంతో ఒక్కో టీచర్ పోస్టుకు సగటున 40 మంది, ఒక్కో ఎస్జీటీ పోస్టుకు 120 మందికిపైగా పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.
News April 21, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.