News October 10, 2025
సత్యసాయి జిల్లాలో 409.6 మి.మీ వర్షపాతం నమోదు

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 409.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టరేట్ నుంచి అధికారులు తెలిపారు. జిల్లాలోని 32 మండలాలలో చిలమత్తూరు మినహా 31 మండలాలలో వర్షం పడినట్లు తెలిపారు. అత్యధికంగా పుట్టపర్తి 38.4, నల్లమాడ 36.0, పెనుకొండ 27.8, గాండ్లపెంట 25.6, అగళి 23.4, ఓడీసీ 22.6, సోమందపల్లి 21.2, రోళ్లలో 20.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
Similar News
News October 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 31 సమాధానాలు

1. విశ్వామిత్రుని ఆశ్రమం ‘సిద్ధారామం’.
2. బర్బరీకుడి తండ్రి ‘ఘటోత్కచుడు’.
3. పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతం’ గ్రంథాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
4. కామ దేవుని వాహనం ‘చిలుక’.
5. సంస్కృతంలో కూడా లక్షను లక్ష అనే అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 10, 2025
మొదటి ద్వారం నుంచే శ్రీవారిని చూసే అవకాశం

శ్రీవారి దివ్య రూపాన్ని బంగారు వాకిలి(మొదటి గడప) నుంచి వీక్షించే భాగ్యాన్ని TTD కల్పిస్తోంది. సాధారణ దర్శనం ఏడో ద్వారం నుంచి జరుగుతుంది. సుప్రభాత, తోమాల వంటి సేవలను అతి చేరువ(10ft) నుంచి చూసి తరించవచ్చు. ఈ అవకాశం లక్కీ డిప్ ద్వారా ఎంపికైనవారికి లభిస్తుంది. ప్రతి నెలా 18వ తేదీన ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ప్రతిరోజూ ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 10, 2025
వర్ధన్నపేట: ప్రిన్సిపల్ దగ్గరుండి మత ప్రచారం చేయించారా..?

వర్ధన్నపేట పట్టణంలో <<17967798>>ఫుస్కోస్ ప్రైవేట్ పాఠశాల<<>>లో విద్యార్థులకు ఏకంగా తరగతి గదిలోనే పాఠాలకు బదులుగా మత బోధనలు, విద్యార్థులు భోజనం చేసే ముందు ఏదైనా పనులు చేసే ముందు దేవుని ప్రార్థించాలని సూచించడం, ఎలా ప్రార్థించాలో ప్రాక్టికల్‌గా చూపెడుతున్నాడు. ఈ వీడియోలో పాఠశాల పక్కనే ఉన్న చర్చికి సంబంధించిన ఏరువ రాయపు రెడ్డి అనే ఫాదర్ బోధనలు చేశాడు. ఆ సమయంలో ప్రిన్సిపల్ తరగతి గదిలోనే ఉండడం చర్చనీయాంశంగా మారింది.