News May 18, 2024
సత్యసాయి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్నికల అధికారి

సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల నిల్వ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ఎన్నికల అధికారి ముఖేశ్ మీనా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ కొండయ్యలతో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 3, 2025
‘అనంతపురాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి’

అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం నార్పల తహశీల్దార్ కార్యాలయం ముందు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అతివృష్టి కారణంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 2, 2025
అనంతపురం: డివైడర్‌ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్‌పై అనంతపురం నుంచి హిందూపూర్‌కి వెళుతుండగా డివైడర్‌ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 2, 2025
రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


