News March 2, 2026

సత్యసాయి జిల్లా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ

image

జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో 2026-27 సంవత్సరానికి సంబంధించిన అక్రిడేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. నియమావళి ప్రకారం అర్హులందరికీ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. తొలి విడతలో 435 కార్డులు అందజేస్తున్నామని, మిగిలిన వారికి రెండో విడతలో ఇస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సమాచారశాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 4, 2026

శుభ సమయం (4-3-2026) బుధవారం

image

➤ తిథి: బహుళ పాడ్యమి సా.4.33 వరకు తదుపరి విదియ ➤ నక్షత్రం: పుబ్బ ఉ.7.37 వరకు, తదుపరి ఉత్తర ➤ శుభ సమయాలు: ఉ.6.17-8.14, ఉ.9.13-10.12, మ.12.33-మ.2.59, సా.4.39-5.02 వరకు ➤ రాహుకాలం: మ.12.00-1.30 వరకు ➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.11.46-మ.12.32 వరకు ➤ వర్జ్యం: మ.3.00-సా.4.38 ➤ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు

News March 4, 2026

సాగర్ ఎడమకాలువలో ఇద్దరు యువకుల గల్లంతు

image

హాలియా పట్టణంలో వాగు సమీపంలో ముగ్గురు యువకులు బిర్యానీ తిని సాగర్ ఎడమ కాలువలో చేతులు కడుక్కోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు కాలుజారి పడిపోవడంతో పక్కనే ఉన్న స్నేహితుడు రక్షించడానికి కాలువలోకి దిగి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని మూడో యువకుడు గ్రామానికెళ్లి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారు పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న వారు స్థానిక ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

News March 4, 2026

అనంతపురం జిల్లాకు ₹736 కోట్ల నిధులు

image

అనంతపురం జిల్లాలోని పట్టణాల్లో తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులకు ₹736.27 కోట్లు మంజూరైనట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్రం అమృత్ 2.0, AIIB కింద ఈ నిధులు కేటాయించిందన్నారు. అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని, ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు.