News March 29, 2025

సత్యసాయి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించినందున కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Similar News

News November 3, 2025

టంగుటూరు: తోపులాటలో అల్లుడి మృతి

image

టంగుటూరు శ్రీనివాసనగర్‌‌కు చెందిన దివ్యకీర్తితో వంశీకి ఆరేళ్ల కిందట వివాహమైంది. వంశీ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ జాబ్ కావడంతో అక్కడ కాపురం పెట్టారు. ఇటీవల భర్తతో గొడవపడి దివ్య తన ఇద్దరు బిడ్డలతో టంగుటూరులోని పుట్టింటికి వచ్చింది. వంశీ ఆదివారం భార్య ఇంటికి వచ్చి బంధువులతో రాజీకి ప్రయత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగి వంశీ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని నిర్ధారించారు.

News November 3, 2025

APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

image

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్‌ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.

News November 3, 2025

SRSP UPDATE: 24 గంటల్లో 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. 16 స్పిల్ వే గేట్ల ద్వారా 47,060 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.