News July 10, 2025
సత్యసాయి భక్తులు గ్రేట్…!

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.
Similar News
News August 30, 2025
విశాఖ: జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే, వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్ ఎస్ఎ రెహమాన్ శనివారం జనసేనలో చేరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రెహమాన్ గతేడాది వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు.
News August 30, 2025
విశాఖలో యాచకుల వివరాలు సేకరణ

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ‘జ్యోతిర్గమయ’ కార్యక్రమం ద్వారా విశాఖలో భిక్షాటన చేస్తున్న 243 యాచకులను రెస్క్యు చేసి వారికి ఆశ్రయం కల్పించారు. 243 మంది యాచకులలో వారి బంధువులకు, ఆశ్రయాల నిర్వాహకులకు అప్పగించారు. మిగిలిన 128 మంది యాచకుల వేలిముద్రల ఆధారంగా వారి ఆధార్ కార్డు వివరాలు తెలుసుకొని బంధువులకు సమాచారం అందించే కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ ప్రక్రియను సీపీ నేరుగా పర్యవేక్షించారు.
News August 30, 2025
విశాఖ జిల్లాలో 131 బార్లకు 263 దరఖాస్తులు: JC

నూతన బార్ పాలసీలో భాగంగా 2025-28 VMRDA చిల్డ్రన్ ఏరీనాలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ శనివారం లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. జిల్లాలో 131 బార్లకు గాను 263 దరఖాస్తులు వచ్చాయని, మొత్తం 67 బార్లుకు గాను గీత కులాలకు 10, జనరల్‌కు 57 బార్లు కేటాయించగా, మిగిలిన వాటిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. పారదర్శకంగా ఈ లాటరీ విధానం జరిగిందని జేసీ తెలిపారు.