News July 10, 2025

సత్యసాయి భక్తులు గ్రేట్…!

image

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.

Similar News

News July 10, 2025

విద్యార్థులతో నంద్యాల కలెక్టర్

image

వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మెగా పీటీఎం’లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్‌ వద్ద విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఫొటోలు దిగారు. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

News July 10, 2025

ప్రేమ పెళ్లి.. వరుడికి 79, వధువుకు 75 ఏళ్లు

image

ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేరళకు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్.బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు.

News July 10, 2025

విమాన ప్రమాదంపై వైరలవుతున్న లేఖ ఫేక్: PIB

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అంటూ వైరలవుతున్న లేఖ ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఆ నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేయలేదని పేర్కొంది. సరైన సమాచారాన్ని అధికార వర్గాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. గత నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో 34 మంది స్థానికులతో కలిపి 275 మంది మరణించినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.