News June 18, 2024

సత్యసాయి: యువతి మృతి.. కారణమిదే

image

ఓబుళదేవరచెరువు మండలం చౌడంపల్లిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ వంశీకృష్ణ వివరాలు..యువతి ఇంట్లో తరచూ ఫోన్‌లో మాట్లాతుండగా తల్లిదండ్రులు దండించారు. దీంతో ఆమె ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. వెతికినా కనబడలేదన్నారు. సోమవారం గ్రామ సమీపంలోని చెక్‌‌డ్యాం వద్ద యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 31, 2025

ATP: లోక్ అదాలత్ ద్వారా 12,326 కేసులు పరిష్కారం

image

అనంతపురం జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 12,326 కేసులు పరిష్కారమైనట్లు SP జగదీష్ బుధవారం వెల్లడించారు. వివిధ కేసుల్లో 61 మందికి శిక్షలు పడ్డాయన్నారు. నిబంధనల ఉల్లంఘనపై రూ.1.35 లక్షల ఈ-చలానాలు విధించి రూ.3.93 కోట్ల జరిమానా వసూలు చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. డయల్ 100 ద్వారా కేవలం 12 నిమిషాల్లో స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నట్లు SP వివరించారు.

News December 31, 2025

2025 అనంతపురం జిల్లా క్రైమ్ రిపోర్ట్ విడుదల

image

* 2024తో పోలిస్తే 2025లో నేరాలు 22.5 శాతం తగ్గుదల
* కేసులు 8,841 నుంచి 6,851కు తగ్గుముఖం
* 55 శాతం చోరీ కేసులు రికవరీ
* జిల్లాలో 42 హత్యలు
* గణనీయంగా తగ్గిన మహిళలపై నేరాలు, పోక్సో కేసులు
* మిస్సింగ్ కేసుల్లో 613 మంది సురక్షితం
* 9 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
* 544 నుంచి 496కు తగ్గిన ప్రమాదాలు
* 22 మందికి గంజాయి కేసుల్లో జైలు శిక్ష పడేలా చర్యలు

News December 31, 2025

అనంతపురంలో ‘అనంత పాల ధార’ అవగాహన కార్యక్రమం

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంత పాల ధార అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జేడీ ప్రేమ్ చంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 7, 8, 9 తేదీల్లో పశు పోషకులకు పాల దిగుబడి పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. వెటర్నరీ వైద్యులు ఈ పోటీలపై తమ పరిధిలోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పోటీలతో పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపుపై రైతులకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.