News January 4, 2025

సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దాం: కలెక్టర్

image

సత్యసాయి విమానాశ్రయంలో మెరుగైన భద్రత కల్పిద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శనివారం విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ హోదాలో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఏయే శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.

Similar News

News January 6, 2025

కూడేరు: రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన దున్నపోతు

image

కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. 

News January 6, 2025

అనంతపురంలో KG టమాటా రూ.6

image

అనంతపురంలో టమాటా ధరలు బాగా పడిపోయాయి. నిన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.10 పలికిందని రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ వెల్లడించారు. మరోవైపు కనిష్ఠ ధర రూ.6గా నమోదైందన్నారు. మొత్తంగా నిన్న ఒక్కరోజు మార్కెట్‌కు 1050 టన్నులు రాగా సరాసరిగా కిలో టమాటా రూ.8 పలికింది.

News January 6, 2025

అనంతపురం: ఒకేరోజు ఏడుగురి మృతి

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం పలు విషాద ఘటనలు జరిగాయి. ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు. రొద్దం, పెద్దపప్పూరు, తాడిపత్రిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పెనుకొండలో ఆవు అడ్డు రావడంతో<<15074331>> మహిళ<<>> , అనంతపురంలో డివైడర్ ఢీకొని ఇంటర్ <<15073707>>యువకుడు<<>> చనిపోయారు. అలాగే గుత్తి ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో కన్నుమూశారు.అలాగే శనివారం అర్ధరాత్రి దాటాక పెద్దవడుగూరు హైవేపై ఐచర్ వాహనం ఢీకొని మరొకరు చనిపోయారు.