News October 14, 2025
సత్యసాయి శతజయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 23 నుంచి ఘనంగా జరగనున్నాయి. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సత్యసాయి సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రసంశించినట్లు రత్నాకర్ తెలిపారు.
Similar News
News October 14, 2025
ALERT: రేపు భారీ వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరులోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 14, 2025
ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు: మంత్రి

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కర్నూలులో సమీక్ష, పర్యవేక్షణ చేపట్టారు. కర్నూలు సభకు 3,070, శ్రీశైలానికి 150, భద్రతా సిబ్బందికి 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్‌నెస్ బస్సులనే వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
News October 14, 2025
స్వదేశీ యాప్స్‌పై పెరుగుతున్న మోజు!

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో తర్వాత స్వదేశీ మ్యాప్స్ యాప్ ‘MapmyIndia’ ఇన్‌స్టాల్స్ భారీగా పెరిగాయి. 1995లో భారతీయ జంట రాకేశ్, రష్మీ వర్మ రూపొందించిన ఈ యాప్, Google Maps కంటే ముందే సేవలు అందిస్తోంది. ఇందులో ఉండే 3D జంక్షన్ వ్యూ ద్వారా సంక్లిష్ట జంక్షన్లలో దారి సులభమవుతుంది. గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై హెచ్చరికలు, లైవ్ సిగ్నల్ కౌంట్‌డౌన్ వంటి ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.