News October 31, 2025
సత్యసాయి శత జయంతి: ఆరుగురు మంత్రులతో కమిటీ

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం, ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మంత్రి అనగాని సత్యప్రసాద్, సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, సవిత, ఆనం రామనారాయణ రెడ్డి నియమితులయ్యారు. కమిటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు MLA పల్లె సింధూర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 31, 2025
మూడు రోజుల్లో మనవరాలి పెళ్లి.. అంతలోనే విషాదం

చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో మనవరాలి పెళ్లి ఉండగా రామారావు హత్యకు గురవడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, పాతర్లపాడు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. సీపీ సునీల్ దత్ ఘటనా స్థలానికి చేరకుని దర్యాప్తు చేపట్టారు.
News October 31, 2025
మాగంటి సునీతపై బోరబండ PSలో కేసు నమోదు

బీఆర్ఎస్ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునితపై ఇచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ PSలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 31, 2025
దంపతుల గల్లంతు.. మృతదేహాలు లభ్యం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం దంపతుల మృతదేహాలను గుర్తించారు. కాగా, ప్రణయ్, కల్పనను విగతజీవులుగా చూసిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


