News April 1, 2025
సత్యసాయి: ‘15 రోజుల్లో నీటి తొట్టెలు పూర్తి చేయాలి’

శ్రీ సత్యసాయి జిల్లాకు మంజూరైన నీటి తొట్టెలను 15 రోజులలో నిర్మించి పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి మండలంలోని కప్పల బండలో నీటి తొట్టె నిర్మాణానికి భూమి పూజ చేసి, అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు 1362 నీటి తొట్టెలు మంజూరు అయ్యాయని అన్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని మూగజీవాలకు తాగునీటి సౌలభ్యం కొరకు వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు.
Similar News
News April 2, 2025
హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం

TG: హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి మృత్యువాత పడినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్‌ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.
News April 2, 2025
MBNR: ఖబర్దార్ రేవంత్ రెడ్డి: డీకే అరుణ

‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూములు వేలం వేయడం సరికాదు..ఆ భూములు ఎవరి జాగిరు కాదు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
News April 2, 2025
కర్ణాటకలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్స్‌పై నిషేధం

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం(1988)లోని సెక్షన్-93ని అనుసరించి ప్రభుత్వం నిబంధనల్ని ఏర్పాటు చేసేవరకూ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులివ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.