News July 8, 2025

సత్వర న్యాయం కోసమే ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే: SP

image

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు SP మహేష్ బీ గితే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 23 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News July 8, 2025

వనపర్తి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు ఈనెల 13 వరకు http://national awardstoteachers.education.gov.in సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News July 8, 2025

ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు: లోకేశ్

image

AP: MLA ప్రశాంతిరెడ్డిపై YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణమన్నారు. ‘YCP నేతలకు మ‌హిళలంటే ఇంత ద్వేష‌భావ‌మా? త‌ల్లి, చెల్లిని త‌రిమేసిన జ‌గ‌న్‌ గారిని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టున్నారు. మ‌హిళ‌ల జోలికి వస్తే ఊరుకునేందుకు ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు.. మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచే ప్ర‌జాప్ర‌భుత్వం’ అని వ్యాఖ్యానించారు.

News July 8, 2025

ఫోర్త్ సిటీ: దేశంలో అతిపెద్ద స్టేడియం!

image

TG: CM రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీలో భాగ్యనగర ఇబ్బందులు లేకుండా నిపుణులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత MGBS-చాంద్రాయణగుట్ట మెట్రో రూట్‌ను అక్కడి నుంచి ఫోర్త్ సిటీకి విస్తరించే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇక కొత్త నగరంలో స్పోర్ట్స్ హబ్ ఉంటుందని CM ఇప్పటికే ప్రకటించగా, ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద స్టేడియాన్ని ఇక్కడ నిర్మిస్తారని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.