News March 29, 2024
సదరం క్యాంపును సద్వినియోగ పరుచుకోవాలి: DRDO సాయన్న
సదరం ధ్రువీకరణ పత్రం కోసం నూతన, రెన్యువల్ దరఖాస్తుదారుల కోసం ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన తేదీలు విడుదల చేసినట్లు DRDO సాయన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి జూన్ 19 వరకు మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తమకు నిర్ణయించిన తేదీల్లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలోని సదరం క్యాంపులో వైద్య పరీక్షలు చేపించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8186000940 నంబర్‌కు సంప్రదించాలన్నారు
Similar News
News January 12, 2025
బెల్లంపల్లి: భోజనం నాణ్యతలో రాజీపడొద్దు. జీఎం
బెల్లంపల్లి ఏరియా కైరుగూడ ఓపెన్ కాస్ట్‌లో జీఎం శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, గుర్తింపు AITUC సంఘం నాయకులు క్యాంటీన్‌ను శనివారం తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో కార్మికులకు అందుతున్న అల్పాహారం, భోజనం, ఏర్పాట్లను పరిశీలించారు. జీఎం మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని పర్సనల్ ఆఫీసర్ వేణును ఆదేశించారు. యూనియన్ నాయకులు అధికారులు ఉన్నారు.
News January 11, 2025
బాసర ఆర్జీయూకేటీకీ JAN13 నుంచి సెలవులు
బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో చదివే పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ సెలవులను వర్సిటీ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు సెలవులిచ్చారు. 19న ఆదివారం సాధారణ సెలవుదినం రావడంతో తరగతులు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
News January 11, 2025
ASF: రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి.. నిందితుడికి జైలు శిక్ష
మద్యం తాగి నిర్లక్ష్యంగా ఆటో డ్రైవింగ్ చేసి ఆరుగురి మరణానికి కారణమైన నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ1500/-జరిమానా విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ వివరాల ప్రకారం.. 2017లో కెరిమెరికి చెందిన రామచందర్ ఆటో నడుపుతుండగా.. ఒకేసారి బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు.