News October 22, 2025
సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

సదర్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్‌బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్‌తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.
Similar News
News October 22, 2025
ఐఫోన్‌కు బదులు ఐక్యూ మొబైల్.. అమెజాన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్

AP: అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్జూమర్ ఫోరం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరేశ్ ఇటీవల అమెజాన్‌లో రూ.80వేలతో ఐఫోన్ 15+ ఆర్డర్ చేయగా దానికి బదులు ఐక్యూ ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా స్పందించకపోవడంతో కన్జూమర్ ఫోరాన్ని సంప్రదించాడు. బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80వేల రీఫండ్‌తో పాటు మరో రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను NOV 21కి వాయిదా వేసింది.
News October 22, 2025
JMKT: క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.7,050

నాలుగు రోజుల విరామం అనంతరం బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. రైతులు 44 వాహనాల్లో 330 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,050 పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 13 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.5,700 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు. తాజాగా పత్తి ధర గత వారం కంటే రూ.250 పెరిగింది.
News October 22, 2025
KNR: ‘గిరిజన హక్కుల పోరాట వీరుడు కొమురం భీమ్’

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. కొమురం భీమ్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహా వీరుడని కొనియాడారు. “జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనుల ఆస్తి, భూమి, అడవుల మీద హక్కుల కోసం ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారని నేతలు తెలిపారు.