News January 16, 2026

సదర్ మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం

image

మామడ మండలం పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ.576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు.

Similar News

News February 13, 2026

వరంగల్: ఎన్నికల కవరేజీ బిల్లులేవీ సారూ..?

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం వీడియో కవరేజ్ చేయించింది. నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలను కవరేజ్ చేయించిన అధికారులు వీడియో గ్రాఫర్లకు బిల్లులు ఇవ్వడంలో తాత్సారం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో కవరేజ్ చేసిన వీడియో గ్రాఫర్లు బిల్లులు అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 13, 2026

గ్రూప్-1 వివాదం: జాబితాలో రేపల్లె RDO రామలక్ష్మి

image

2018 గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు SIT విచారణకు ఆదేశించింది. జవాబు పత్రాల ట్యాంపరింగ్‌ ఆరోపణపై అదనపు DG నేతృత్వంలో విచారణ జరపాలని పేర్కొంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులను తక్షణమే నాన్-ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అధికారుల జాబితాలో రేపల్లె RDO రామలక్ష్మి ఉన్నారు. కోర్టు ఈ నెల 11న తాజా ఆదేశాలతో ఆమెను ప్రాధాన్యత లేని పోస్ట్‌కు బదిలీ చేయనుంది.

News February 13, 2026

ఎన్నికల సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ

image

TG: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, కార్యకర్తలు.. ఇలా ఎవరైనా చట్టానికి అతీతులు కారన్నారు. సిబ్బంది పొరపాట్లు చేస్తే SECకి లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటికే పోలీసులు, ఉద్యోగుల మీద చేసిన దౌర్జన్యాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని SPలను ఆదేశించారు.