News February 8, 2025
సదాశివనగర్: బావిలో పడి వృద్ధురాలి ఆత్మహత్య
బావిలో పడి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుశీల(70) గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆమె జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి గ్రామ శివారులోని బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ వెల్లడించారు.
Similar News
News February 8, 2025
కడప విమానాశ్రయ అభివృద్ధికి కార్యాచరణ
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి.. కడప విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది.
News February 8, 2025
కరీంనగర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ఇందిరానగర్‌లో జరిగింది. పోలీసుల కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News February 8, 2025
ముచ్చటగా మూడోసారా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో అక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. రాజధానిలో గడచిన 2సార్లూ ఆప్‌దే అధికారం. ముచ్చటగా మూడోసారీ గెలిచి అధికారంలోకి వస్తామని ఆప్ భావిస్తుంటే.. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీని ఈసారి చేజిక్కించుకుంటామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గు చూపుతున్నాయి. మరి ఢిల్లీ ఓటరు మనోగతం ఎలా ఉందో నేటి సాయంత్రం లోపు తేలనుంది.