News July 6, 2024
సదాశివనగర్: రైతుపై కత్తులతో దాడి చేసిన దుండగులు
రైతుపై కత్తులతో దాడి చేసిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తనూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్వతరావు (62) గురువారం పంటచేనులో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు పరుగెత్తి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. దాడికి గల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2025
BREAKING: కామారెడ్డి జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం
KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
News February 8, 2025
BREAKING: నిజామాబాద్: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్‌కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.
News February 8, 2025
NZB: వాహనాలు నడుపుతున్నారా..? నిబంధనలు పాటించాల్సిందే!
వాహనదారులకు నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
> పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
> వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉండాల్సిందే.
> బైకర్లు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు.
> హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దు.
> అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
> నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు SHARE IT