News February 28, 2026
సదాశివపేట: ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. 14 మందికి గాయాలు

సదాశివపేట పట్టణ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సీఐ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
కెనడాతో భారత్ ₹24వేలకోట్ల యురేనియం డీల్

అణుశక్తి కోసం భారత్ కెనడాతో ₹24వేలకోట్ల విలువైన యురేనియం డీల్ కుదుర్చుకుంది. ఆ దేశ ప్రధాని మెక్ కార్నీ భారత్ పర్యటనలో భాగంగా నిన్న దీనిని ఖరారు చేసుకుంది. దీంతో కెనడా ఇకపై భారత్‌కు యురేనియమ్‌ను సప్లై చేయనుంది. దేశంలో ఏటా 600 టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుండగా ఇండియాకు ప్రస్తుతం 1800 టన్నులు అవసరం. 2047 నాటికి భారత్ అణుశక్తి సామర్థ్యం 100 గిగావాట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది.
News March 3, 2026
ఖమేనీ మృతిపై నిరసనలు.. చాహల్ పోస్ట్

దేశంలో ఖమేనీ మృతిపై పలు చోట్ల నిరసనలు జరగడంపై టీమ్ఇండియా క్రికెటర్ చాహల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి లేదంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్లిపో’.. అనే క్యాప్షన్‌తో ఓ వ్యక్తి టీషర్ట్ ధరించిన ఫొటో తన X అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కాగా అంతకుముందు యాంకర్ రష్మీ సైతం ఈ ఆందోళనలు చేసే వారిని ఇరాన్ పంపించేయాలని ప్రధాని మోదీని కోరుతూ పోస్ట్ చేశారు.
News March 3, 2026
వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్ ధరల హైక్ ఇప్పట్లో లేనట్లే!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలతో పెరిగిన ముడిచమురు ధరల ఎఫెక్ట్ దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలపై ఉంటుందనే ఆందోళన మొదలైంది. అయితే ఇప్పట్లో ఇంధన ధరల పెరుగుదల ఉండదని సమాచారం. ఇప్పటివరకు ఇంధన సంస్థలు చమురు ధరలు పెరిగినప్పుడు భారం భరించి, తగ్గినప్పుడు రికవర్ చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా కేంద్రం ఇదే పాలసీని కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. చివరగా 2022 ఏప్రిల్‌లో ధరలు పెరిగాయి.


