News April 11, 2025
సదాశివపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్లాట్ బుకింగ్

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానానికి సదాశివపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపికైంది. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యానికి వెళ్లిన 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మాత్రమే ఎంపికైందని జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి తెలిపారు.
Similar News
News April 18, 2025
‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం మన మెదక్. జిల్లాలో వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, 100 ఏళ్ల సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చరిత్ర పరిశోధకుడు సంతోశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు World Heritage Day
News April 18, 2025
కొంకన్న గుట్టపై ఆదిమానవుడి ఆనవాళ్లు

బోథ్ మండలం దన్నూర్(బి) సమీపంలోని కొంకన్నగుట్ట అటవీ ప్రాంతంలో ఆది మానవుడు నివసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఆర్ఓ ప్రణయ్ తెలిపారు. తన బృందంతో కలిసి శుక్రవారం అడవిని పరిశీలించే క్రమంలో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయన్నారు. లక్షల ఏళ్ల కిందట ఆదిమానవుడు ఉపయోగించిన సూక్ష్మ రాతి మొనదేలిన అత్యంత చురుకైన చాకు లాంటి రాళ్లు లభించాయన్నారు. వీటిని వేటకు ఉపయోగించినట్లు తెలుస్తోందన్నారు.
News April 18, 2025
అతడి ప్రశాంతత వల్ల మాపై ఒత్తిడి తగ్గింది: భువనేశ్వర్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.