News December 18, 2024

సదాశివపేట: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన సదాశివపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నిజాంపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభంపై బల్బు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో విద్యుత్ స్తంభంపైన మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News February 15, 2026

మెదక్: 16న మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక

image

మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలను ఈనెల 16న పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉ.11 గంటలకు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మ.12:30 గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. సమావేశానికి కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

News February 14, 2026

మెదక్: రేపు 11లోపు Form-A సమర్పించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ అధికార ప్రతినిధిత్వానికి సంబంధించి Form-Aని రేపు ఉ.11 గంటలలోగా సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. అలాగే Form-Bని ఎన్నిక రోజు ఉ.10 గంటల వరకు అందజేయాలని సూచించారు. గడువులోపు మార్పులకు అవకాశం ఉంటుందని, ఎన్నికల సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరారు.

News February 14, 2026

మెదక్: ఏడుపాయల జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు

image

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగే ఏడుపాయల వనదుర్గ మాత జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంగణాన్ని సిసి కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. భద్రత కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.