News October 31, 2024

సదాశివ నగర్: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో పండగ నాడు ఘోరం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేశారని ఎస్ఐ చెప్పారు.  ఈ వ్యక్తికి ఎడమ చేయి లేదని పేర్కొన్నారు. వివరాలకు సదాశివ నగర్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 3, 2025

NZB: జిల్లా జైలును సందర్శించనున్న DG సౌమ్య మిశ్రా

image

నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలును సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (DG) సౌమ్య మిశ్రా సందర్శించనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం జిల్లా జైలుకు వచ్చే ఆమె అక్కడ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడతారని అధికారులు వివిరించారు. కాగా ఆమె పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

News February 2, 2025

NZB: దిల్ రాజుకు ఆహ్వానం

image

నిజామాబాద్‌లో వారాహి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఆదివారం వారాహి మాత ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 10న ఆలయ శంకుస్థాపన నిర్వహిస్తున్నామని వివరించారు.

News February 2, 2025

లింబాద్రి గుట్ట స్వామిని దర్శించుకున్న శ్రీముఖి

image

భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆమెకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఆమెతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు.