News April 25, 2025
సదుం ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌పై వేటు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సదుం ఇన్‌ఛార్జ్ MRO మారూఫ్ హుస్సేన్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు వీఆర్వో మహబూబ్ బాషాను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త MROను నియమించే వరకు ప్రస్తుతం డీటీగా ఉన్న కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
సినీ ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసులు మృతి

రొంపిచర్ల: సినిమా, సీరియల్ రంగంలో ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ పోతుల శ్రీనివాసులు(60) బుధవారం చెన్నైలో మృతి చెందారు. రొంపిచర్లలోని బెస్తపల్లికి చెందిన ఈయన 30 ఏళ్లుగా తమిళం, తెలుగు సినిమా, సీరియల్ రంగంలో ఉన్నారు. గుండెపోటు రావడంతో చెన్నైలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకువస్తున్నారన్నారు.
News September 17, 2025
చిత్తూరు: ఐటీఐలో అడ్మిషన్ల ప్రారంభం

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు www.iti.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు ఈనెల 29న, ప్రైవేట్ విద్యార్థులకు 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐని సంప్రదించాలని సూచించారు.
News September 17, 2025
చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.