News November 28, 2025

సనత్‌నగర్: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి

image

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 28, 2025

HYD: విశిష్ట రంగస్థల పురస్కారం గ్రహీత.. ప్రొఫైల్ ఇదే!

image

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావుకు 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం వరించింది. 2001లో K2 నాటికకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, తెలుగులో ‘ప్రతాప రుద్రమ’ నాటకానికి దర్శకత్వం వహించిన తొలి తెలుగువాడిగా ఘనత సాధించారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి సందర్శించారు.

News November 28, 2025

SUలో 14 ఏళ్ల తర్వాత తెలుగు PHDకి పర్మిషన్

image

శాతవాహన వర్సిటీలో 14 ఏళ్ల తర్వాత తెలుగు పీహెచ్‌డీకి అనుమతి లభించింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ వీసీ ప్రొ.ఉమేష్ కుమార్‌ను జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య, తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు గజమాలతో ఘనంగా సత్కరించారు. నెట్, సెట్ సాధించిన విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని చైతన్య పేర్కొనగా, వర్సిటీ అభివృద్ధే తన లక్ష్యమని వీసీ తెలిపారు. కార్యక్రమంలో డా.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

News November 28, 2025

RR: నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు

image

గ్రామపంచాయతీ ఎన్నిక నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..
– నామినేషన్ పత్రాలను నిర్దిష్ట సమయంలో దాఖలు చేయకపోవడం
– నిర్దేశించిన చోట అభ్యర్థులు, ప్రతిపాదించే వారు సంతకాలు చేయకపోవడం
– ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే
– ఆస్తులు,అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపర్చకపోవడం
– చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదును చెల్లించకపోవడం ప్రధాన అంశాలు.