News April 3, 2025
సన్న బియ్యం పంపిణీ చేసిన నల్గొండ కలెక్టర్

దిండి(గుండ్లపల్లి) మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 4, 2025
NLG: అగ్రిగోల్డ్ మోసానికి పదేళ్లు

ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట దక్కడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 2015లో కేసులు నమోదు చేశారు. జిల్లాలో సుమారు వేల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఉన్నారు. సుమారు 10 ఏళ్లు కావస్తున్నా.. బాధితులకు నేటికీ చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
News April 4, 2025
NLG: జిల్లాలో మామిడికి గడ్డు పరిస్థితులు!

ఉద్యాన పంటల్లో ఫలరాజంగా ప్రసిద్ధి చెందిన మామిడికి ఈ ఏడాది గడ్డు పరిస్థితులు దాపురించాయి. గతేడాది సకాలంలో వర్షాలు కురియక, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత సకాలంలో రాలేదు. వచ్చిన పూత కూడా నిలవకుండా మాడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దట్టంగా కురిసిన పొగమంచు పూతను దెబ్బతీసిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది కనీసం 1 నుంచి 2 టన్నుల వరకైనా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు.
News April 4, 2025
NLG: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

నల్గొండ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.